బ్రేకింగ్ : పవన్ వద్దకు ఆలీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని భావిస్తున్న సినీనటుడు ఆలీ కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయనను జనసేన నేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు [more]

Update: 2019-01-06 06:02 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని భావిస్తున్న సినీనటుడు ఆలీ కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయనను జనసేన నేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు పవన్ వద్దకు తీసుకెళ్లారు. తొలినుంచి పవన్ కు ఆలీ సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆలీ కొద్దిరోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. ఆలీ ఈనెల 9వ తేదీన ఇచ్ఛాపురంలో జరగనున్న పాదయాత్ర ముగింపు సభలో వైసీపీ లో చేరతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను ఆలీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను వైసీపీలో ఎందుకు చేరదలచుకున్నదీ ఆలీ పవన్ కు వివరిస్తారా? లేక పవన్ ఇచ్చే హామీతో ఆయన జనసేన వైపు మొగ్గు చూపుతారా? అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News