బ్రేకింగ్ : చింతమనేని అరెస్ట్

టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన ఇంటికి వచ్చారు. చింతమనేని భార్య రాధారాణి అనారోగ్యానికి గురి [more]

Update: 2019-09-11 06:35 GMT

టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన ఇంటికి వచ్చారు. చింతమనేని భార్య రాధారాణి అనారోగ్యానికి గురి కావడంతో పన్నెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని దుగ్గిరాలలోని తన సొంత ఇంటికి వచ్చారు.అయితే అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు చింతమనేనిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే చింతమనేనిని అరెస్ట్ చేయవద్దంటూ కార్యకర్తలు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. కార్యకర్తలను పోలీసులు చెల్లాచెదురు చేశారు. చింతమనేని ప్రభాకర్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేయడం కోసం 12 పోలీసు బృందాలు గత కొద్దిరోజులుగా గాలిస్తున్నాయి. చింతమనేనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చే అవకాశముంది.

Tags:    

Similar News