ఇంతటి దుర్మార్గ పాలనను ఎన్నడూ చూడలేదు

ఏపీలో జరుగుతున్న దుర్మార్గ పాలనను ఎన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేరగాళ్లు అధికారంలోకి వస్తే ఇలానే ఉంటుందని [more]

Update: 2020-10-13 13:15 GMT

ఏపీలో జరుగుతున్న దుర్మార్గ పాలనను ఎన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేరగాళ్లు అధికారంలోకి వస్తే ఇలానే ఉంటుందని చెప్పారు. ఒక తప్పు చేసి దానిని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వం మరో తప్పు చేస్తుందన్నారు. తన అవినీతిని ఇతరులకు అంటించడానికి కూడా జగన్ వెనకాడటం లేదని చంద్రబాబు తెలిపారు. తప్పుడు వార్తలతో ప్రజల్లో అపోహలను సృష్టించి, కులాలు, మతాలుగా విడదీయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయపెట్టి లొంగదీసుకోవడం వైసీపీ నిత్యకృత్యంలో భాగమయిపోయిందన్నారు.

Tags:    

Similar News