బ్రేకింగ్ : మద్యం ధరలు పెంచడమా?.. ఎవడిచ్చాడు ఆ అధికారం?

మద్యం దుకాణాలను ఇప్పటికిప్పుడు తెరవాల్సిన అవసరం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. మద్యం దుకాణాల వద్ద పోలీసులను పెట్టి నడిపిస్తారా? అని నిలదీశారు. మద్యం దుకాణాలు [more]

Update: 2020-05-05 08:08 GMT

మద్యం దుకాణాలను ఇప్పటికిప్పుడు తెరవాల్సిన అవసరం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. మద్యం దుకాణాల వద్ద పోలీసులను పెట్టి నడిపిస్తారా? అని నిలదీశారు. మద్యం దుకాణాలు తెరవడంతో అనేక కారణాలతో ఆరుగురు చనిపోయారన్నారు. మద్యం తాగి ఇంట్లో గృహహింస కు పాల్పడుతున్నారన్నారు. ఉపాధ్యాయులను కూడా మద్యం దుకాణాలను కాపలా పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. విచ్చలవిడిగా పాలన చేస్తే ఇలాగే ఉంటుందన్నారు. మద్యం వల్ల కొన్ని చోట్ల హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో కోత పెట్టి మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మద్యం దుకాణాల వద్ద మహిళలు ఆందోళన చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. జగన్ తన సొంత బ్రాండ్లను మద్యం షాపులతో ఉంచుతున్నారన్నారు.

జే ట్యాక్స్ కోసమే….

జే ట్యాక్స్ కోసమే పేరులేని బ్రాండ్లను ఉంచుతున్నారని చెప్పారు. మద్యంధరలు పెంచడం వల్ల మరింత ఆర్థిక భారం పడుతుందన్నారు. మద్యం ధరల పెంచడం వల్ల వినియోగం ఎలా తగ్గుతుందని చంద్రబాబు నిలదీశారు. ఉత్పత్తి తగ్గించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ కు ప్రజలంటే భయం లేదన్నారు. ఈ బ్రాండే తాగాలని చెప్పే అధికారం జగన్ కు ఎవరిచ్చారన్నారు. తన జీవితంలో ఇప్పటి వరకూ ఇన్ని రోజులు ఇంటిపట్టున ఉండలేదన్నారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘించడం ఇష్టంలేకనే హైదరాబాద్ లోనే ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. దుకాణాలు తెరవకుండా కొన్ని రోజులు ఆగలేరా? అని ప్రశ్నించారు. సెలెక్ట్ బ్రాండ్లతోనే విక్రయాలు జరుగుతున్నాయన్నారు. కేరళలో అక్కడి ప్రభుత్వం కరోనాను కట్టడి చేయగలిగిందన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడే జగన్ మద్యం దుకాణాలను ఆత్రంగా తెరిచారన్నారు.కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తుందో చెప్పాలన్నారు. ప్రభుత్వంపై సమిష్టిగా పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News