జగన్ కు కరోనా కంటే ఎన్నికలే ముఖ్యమా?

జగన్ ఎవరు చెప్పినా వినరని, తాను అనుకున్నదే చేస్తాడనేదానికి ఇదే నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ను విపత్తుగా [more]

Update: 2020-03-15 11:57 GMT

జగన్ ఎవరు చెప్పినా వినరని, తాను అనుకున్నదే చేస్తాడనేదానికి ఇదే నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ను విపత్తుగా గుర్తిస్తే జగన్ మాత్రం లైట్ గా తీసుకుంటాడన్నారు. చాలా దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లో షట్ డౌన్ చేశారన్నారు. 147 దేశాల్లో కరోనా వైరస్ ను గుర్తించారన్నారు. జగన్ కు రాజకీయ ప్రయోజనమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు తెలియవన్నారు. ట్రంప్ కూడా అమెరికాలో ఎమెర్జెన్సీని ప్రకటించారన్నారు. కానీ జగన్ మాత్రం కరోనా వైరస్ వల్ల ఎన్నికలను వాయిదా వేయడమేంటని అడుగుతున్నారన్నారు. జగన్ కు ప్రజల ఆరోగ్యం కంటే ఎన్నికలే ముఖ్యమని చంద్రబాబు తెలిపారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు. జగన్ అహంభావంతో వ్యవహరిస్తున్నారన్నారు. తొలి నుంచి తాము ఎన్నికల కమిషన్ కు చెబుతున్నామని, కరోనా వైరస్ తో వాయిదా వేయాలన్నారు. ఎన్నికల్లో ఓట్లేశారు కాబట్టి సర్వాధికారి అని అనుకుంటున్నారన్నారు.

Tags:    

Similar News