బాబు చేతికి గాయం…?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి చేతికి ఏమైంది? ఆయన చేతికి గాయమయినట్లు తెలుస్తోంది. విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు వచ్చారు. అయితే [more]

Update: 2019-08-13 06:42 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి చేతికి ఏమైంది? ఆయన చేతికి గాయమయినట్లు తెలుస్తోంది. విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు వచ్చారు. అయితే ఆయన కుడిచేతికి కట్టు కట్టి ఉంది. దీనిని గమనించిన నేతలు కొందరు ఆరా తీసే ప్రయత్నం చేశారు. చంద్రబాబునాయుడు చేతికి కట్టుతోనే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఎన్నికల్లో సీట్లు తక్కువ వచ్చినా ఓట్లు శాతం పెరిగిందన్నారు. వైసీపీ దాడులను ప్రతిఘటించాలని ఆయన కార్యకర్తలను కోరారు. చంద్రబాబు చేతికి గాయం విషయమే కార్యక్రమంలో చర్చనీయాంశమైంది. వైసీపీ అరాచకాలు కొనసాగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో జగన్ పులివెందుల పంచాయతీ చేస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Tags:    

Similar News