అనుమతి వైఎస్ ఇచ్చారు

నదికి వంద మీటర్లకు దూరంగా ఉంటే భవనాలను నిర్మించుకోవచ్చని బిల్డింగ్ రూల్స్ చెబుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి జగన్ [more]

Update: 2019-07-18 05:00 GMT

నదికి వంద మీటర్లకు దూరంగా ఉంటే భవనాలను నిర్మించుకోవచ్చని బిల్డింగ్ రూల్స్ చెబుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఆ చట్టం తెచ్చిన తేదీని ప్రకటించాలని జగన్ డిమాండ్ చేశారు. కృష్ణా నది పక్కన నిర్మించలేదని, ప్రకాశం బ్యారేజీని బౌండరీగా చూసుకోవాలన్నారు. తాను నిబంధనలకు విరుద్దంగా ఎన్నడూ వ్యవహరించలేదన్నారు. మంతెన సత్యనారాయణ రాజు నేచురల్ క్యూర్ ఆసుపత్రి కరకట్ట వద్ద నిర్మించుకునేందుకు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుమతి ఇచ్చారని చెప్పారు చంద్రబాబు. తాను నివసిస్తున్న భవనానికి పంచాయతీ అనుమతి ఉందన్నారు. ప్రజావేదిక వద్దకు వెళితే తానే కన్పిస్తుంటానని జగన్ దానిని కూల్చివేశారని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా చంద్రబాబు సభలో చదివి విన్పించారు.

Tags:    

Similar News