అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ దుర్మార్గం

ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. యాంటి టైమ్ వేసి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయడం హేయమైన చర్యగా [more]

Update: 2020-07-01 13:10 GMT

ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడిని ఆసుపత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. యాంటి టైమ్ వేసి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయడం హేయమైన చర్యగా చంద్రబాబు తెలిపారు. సాయంత్రం 5గం తర్వాత 4.20గం సమయం వేసి డిశ్చార్ చేయడం దుర్మార్గమన్నారు. డిశ్చార్జ్ చేయడంలో కనీస నిబంధనలు పాటించక పోవడం గర్హనీయమని చెప్పారు. కమిటి పేరుతో డాక్టర్స్ డే రోజునే ఒత్తిళ్లు తెచ్చి తప్పుడు నివేదిక ఇప్పించడం శోచనీయమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కమిటి ముసుగులో, తప్పుడు నివేదికలతో, ప్రభుత్వ ఒత్తిళ్లతో అచ్చెన్నాయుడి ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని ఖండిస్తున్నట్లు చంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. ఇప్పటికే అచ్చెన్నాయుడి అరెస్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, అమానవీయంగా వ్యవహరించిందని, మళ్లీ రెండోసారి సర్జరీ జరిగేందుకు కారణమైందని. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం విచారకరమని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News