ఏపీలోనూ అమెరికా తరహా ఉద్యమం రావాల్సిందే

ఏపీలోనూ అమెరికా తరహా ఉద్యమం రావాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమెరికాలో ట్రంప్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే అక్కడ ప్రజలు తిరగబడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు [more]

Update: 2020-06-12 12:42 GMT

ఏపీలోనూ అమెరికా తరహా ఉద్యమం రావాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమెరికాలో ట్రంప్ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే అక్కడ ప్రజలు తిరగబడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ ను ఆయన ఖండించారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయతీ అమలు జరుగుతోందన్నారు. విజిలెన్స్ రిపోర్ట్ లో అచ్చెన్నాయుడు పేరు ఎక్కడా లేకున్నా ఫ్యాబ్రికేట్ చేశారని చంద్రబాబు చెప్పారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. అభివృద్ధి ఎక్కడా కన్పించడం లేదన్నారు. ఏడాదినుంచి పోలవరంలో ఒక్క ఇటుకను కూడా వేయలేదన్నారు. రేపు తెలుగుదేశం కార్యకర్తలంతా ఇళ్లలోనే ఉండి అచ్చెన్నాయుడుకు మద్దతు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కక్ష సాధింపుకు అంతే లేకుండా పోయిందన్నారు. విచారణకు అచ్చెన్నాయుడు రానని చెప్పారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడిని అన్ని రకాలుగా అవమానించారన్నారు. ఇసుక, మద్యం పై అచ్చెన్నాయుడు రాజీలేని పోరాటం చేస్తుండబట్టే ఆయనను అరెస్ట్ చేశారని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News