బాబు ఐదో పత్రం ఇదే…!!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఐదో శ్వేతపత్రాన్ని విడుదలచేశారు. వరుసగా ఐదు రోజుల నుంచి ఒక్కో అంశంపైచంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. తాము నాలుగున్నరేళ్లుగా [more]

Update: 2018-12-27 13:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఐదో శ్వేతపత్రాన్ని విడుదలచేశారు. వరుసగా ఐదు రోజుల నుంచి ఒక్కో అంశంపైచంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. తాము నాలుగున్నరేళ్లుగా వివిధ అంశాలపై చేసిన అభివృద్ధిని ఆయన వివరిస్తూ వస్తున్నారు. తాజాగా నీటి పారుదల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేశారు. రెండు కోట్ల ఎకరాలకు నీరందించడమే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశామని, భవిష్యత్తులో గోదావరి, పెన్నా నదులను కూడా అనుసంధిస్తామని అన్నారు. దీంతో పాటుగా నాగావళి, వంశధార నదులను కూడా అనుసంధిస్తే ఉత్తరాంధ్రలో తాగు, సాగునీటికి కొరత ఉండదన్నారు.

Tags:    

Similar News