నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్

Update: 2018-07-12 11:56 GMT

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గది లేదని, నాలుగేళ్లుగా ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కేంద్రం నుంచి నిధులు రాకున్నా రాష్ట్ర నిధులతో పనులు జరిపిస్తున్నామని, కేంద్రం మాత్రం కొర్రీలు వేస్తూ ఆమోదించడం లేదని ఆరోపించారు. డీపీఆర్-1కి సంబంధించి ఇంకా రూ.430 కోట్లు కేంద్రం ఇవ్వాలని, డీపీఆర్-2 ఇచ్చి ఏడాది అయినా ఇంకా ఆమోదించలేదని పేర్కొన్నారు.

కేంద్రం కోర్రీలు.....

అయితే, కొన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని గడ్కరీ చెప్పారని, ఢిల్లీకి అధికారులను పంపిస్తామని, ఏ సమాచారం కావాలో ఇస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. అవసరమైతే సెక్రటేరియట్ నే ఢిల్లీకి తీసుకుని తానే స్వయంగా వస్తానని చెప్పినట్లు తెలిపారు. ఎవరో ఆరోపణలు చేస్తే దానిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడవద్దని గడ్కరీకి చెప్పినట్లు పేర్కొన్నారు. భూసేకరణ ఖర్చు రెట్టింపు అవ్వడానికి కేంద్రం తెచ్చిన 2013 భూసేకరణ చట్టమే కారణమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న సమయానికి పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేస్తామని చెప్పారు.

Similar News