చల్లా వారసుడికి అరుదైన అవకాశం

చల్లా రామకృష్ణారెడ్డి బలమైన నేత. మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. ఆయన గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. టీడీపీలో ఉన్నా ఆయనకు ఎమ్మెల్సీ [more]

Update: 2021-02-26 01:07 GMT

చల్లా రామకృష్ణారెడ్డి బలమైన నేత. మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్. ఆయన గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. టీడీపీలో ఉన్నా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. కేవలం ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్ పదవిని మాత్రమే చంద్రబాబు కట్టబెట్టారు. దీంతో ఆయన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి రాగానే చల్లా రామకృష్ణారెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఆయన ఇటీవల కరోనాతో మరణించారు. దీంతో ఆయన కుమారుడు చల్లా భగీరధరెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత చల్లా భగీరధరెడ్డి పై ఉంది.

Tags:    

Similar News