బ్రేకింగ్: భారీ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్రం

రైతులకు ఆదుకునేందుకు కేంద్ర బడ్జెట్ భారీ పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణలో అమలవుతున్న ‘రైతుబంధు’ తరహాలోనే రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని [more]

Update: 2019-02-01 06:20 GMT

రైతులకు ఆదుకునేందుకు కేంద్ర బడ్జెట్ భారీ పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణలో అమలవుతున్న ‘రైతుబంధు’ తరహాలోనే రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. శుక్రవారం లోక్ సభలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ బడ్జెట్ లో భాగంగా ఈ పథకాన్ని ప్రకటించారు. దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు ఆదుకునేందుకు గానూ ఈ పథకానికి రూ.75 వేల కోట్లు కేటాయించారు. 2018 డిసెంబర్ 1 నుంచే ఈ పథకం ప్రారంభమైనట్లు ప్రకటించారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేల నగదు నేరుగా వారి ఖాతాల్లోకే మూడు విడతల్లో పంపించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి కలిగనుంది. ఇందుకుగానూ వెంటనే మొదటి విడత నగదు రైతులకు అందించనున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News