ఈరోజు ఏడోసారి చర్చలు

రైతు సంఘాలతో నేడు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఏడోసారి రైతు సంఘాలతో చర్చలు జరపనున్నారు. ఆరుసార్లు చర్చలు విఫలమయ్యాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు [more]

Update: 2021-01-04 03:32 GMT

రైతు సంఘాలతో నేడు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఏడోసారి రైతు సంఘాలతో చర్చలు జరపనున్నారు. ఆరుసార్లు చర్చలు విఫలమయ్యాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. మద్దతు ధరపై లిఖిత పూర్వక హామీని మాత్రం ఇస్తానంటున్నాయి. ఇప్పుడు ఏడోసారి చర్చలు అయినా ఫలప్రదం కావాలని కోరుకుంటున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నవంబరు 26 నుంచి కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్నారు.

Tags:    

Similar News