వివేకా హత్య కేసుపై ఈయన ఏం చెప్పారంటే?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డిని విచారించారు. ముఖ్యమంత్రి జగన్ మేనమామ రవీంద్ర [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డిని విచారించారు. ముఖ్యమంత్రి జగన్ మేనమామ రవీంద్ర [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డిని విచారించారు. ముఖ్యమంత్రి జగన్ మేనమామ రవీంద్ర నాధ్ రెడ్డిని దాదాపు గంట సేపు సీీబీఐ అధికారులు విచారించారు. ఈ హత్య కేసులో నిందితులు ఎవరో త్వరగా తేల్చాలని సీబీఐ అధికారులను కోరినట్లు రవీంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. తనకు, వైఎస్ వివేకానందరెడ్డికి ఉన్న సంబంధాల గురించి సీబీఐ అధికారులు అడిగారని ఆయన చెప్పారు. ఈ హత్య తమ కుటుంబానికి అవమానమేనని రవీంద్ర నాధ్ రెడ్డి తెలిపారు.