ఊచలు లెక్కపెట్టాల్సిందేనా….!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసు మళ్లీ తెరపైకి రానుందా…? ఏపీ డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ అనంతరం జరిగిన మీడియా సమావేశం [more]

Update: 2019-06-02 01:56 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసు మళ్లీ తెరపైకి రానుందా…? ఏపీ డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ అనంతరం జరిగిన మీడియా సమావేశం లో ప్రత్యేకించి కాల్ మనీ రాకెట్ గురించి ప్రస్తావించడంపై మర్మం ఏంటి…?

ఆయనే పర్యవేక్షిస్తారా…?

విజయవాడ పోలీస్ కమిషనర్ గా గౌతమ్ సవాంగ్ పనిచేస్తున్న తరుణంలో ఈ కేసు తెరపైకి రావడం ఆయన ఉక్కుపాదం మోపారు. ఆ కేసు స్టడీలో అన్ని ఆధారాలు సేకరించిన గౌతమ్ సవాంగ్ నేరుగా కాల్ మనీ కేసును పర్యవేక్షించే అవకాశం ఉందా…?కాల్ మనీ కేసులో తెలుగుదేశం నేతల కీలక ప్రమేయం ఉన్న నేపథ్యంలో వారితోఊచలు లెక్కించేందుకు జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా…? అంటే అవుననే అనిపిస్తోంది.

టీడీపీ నేతలను…..

కాల్ మనీ కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి రావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్ అనుచరుల్లో ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసు కాల్ మనీ కేసు. అప్పులు ఇచ్చి మహిళలను బలవంతంగా లొంగదీసుకోవడంతోపాటు, వారిని వ్యభిచార కూపంలో దించుతున్న కాల్‌మనీ కేసు మళ్లీ తెరపైకి వస్తుండటం ఇప్పుడు రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

Tags:    

Similar News