మేం సాయం చేస్తే... మీరు విగ్రహాలు పెడతారా..?

Update: 2018-11-06 14:09 GMT

ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఇటీవల గుజరాత్ లో ప్రారంభమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం రికార్డులకు ఎక్కింది. ఈ విగ్రహ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వ, గుజరాత్ ప్రభుత్వం గొప్ప పనిగా అభివర్ణిస్తున్నాయి. అయితే, వివిధ పార్టీలు మాత్రం సర్దార్ విగ్రహ ఏర్పాటు పట్ల మిశ్రమ స్పందన వ్యక్తం చేశాయి. సర్దార్ గొప్పదనాన్ని ఎవరూ తక్కువ చేయలేరు, కానీ సుమారు రూ.3 వేల కోట్ల ఖర్చు విగ్రహం కోసం పెట్టడం అవసరమా అనే విమర్శలు వచ్చాయి. అయితే, పర్యాటకం అభివృద్ధి అవుతుందని, తద్వారా అదాయం పెరుగుతుంది అని గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ విగ్రహ ఏర్పాటును సమర్థించుకున్నాయి.

మనం సాయం చేయాల్సిన అవసరం లేదు

ఇక సర్దార్ విగ్రహ ఏర్పాటు వివిధ దేశాల్లోని పత్రికల్లో కూడా ప్రచురితమైంది. దీంతో తాజాగా ఓ బ్రిటన్ ఎంపీ భారత చర్యను తప్పుపట్టారు. భారత్ కు వివిధ పథకాల కోసం రూ.9,492 కోట్ల ఆర్థిక సహాయం మనం అందిస్తే, భారత్ మాత్రం మూడు వేల కోట్లతో కేవలం ఒక విగ్రహం నిర్మించిందని కన్జర్వేటీవ్ పార్టీ ఎంపీ పీటర్ బోన్ విమర్శించారు. భారత ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని పేర్కొన్నారు. ఒక విగ్రహం కోసం భారత్ 3 వేల కోట్లు ఖర్చు చేయగల స్థామత ఉన్నప్పుడు ఇక భారత్ కి తాము సహాయం చెయ్యాల్సిన అవసరం లేదని అన్నారు. పీటర్ వాదనను మరికొందరు ఎంపీలు కూడా ఏకీభవించారు.

Similar News