అలాగే ముందుకు వెళ్తాం

ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ముందుకు వెళతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రేపు హై పవర్ కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. తమ అభిప్రాయాలను [more]

Update: 2020-01-17 08:02 GMT

ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ముందుకు వెళతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రేపు హై పవర్ కమిటీ మరోసారి సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి జగన్ కు వివరించామని చెప్పారు. సీఆర్డీఏను రద్దు చేస్తున్నట్లు తనకు తెలియదన్నారు. మీడియాలో వస్తే తాను చూశానని బొత్స తెలిపారు. రాజధాని తరలింపుపై రైతుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈరోజు తుదిగడువుగా నిర్ణయించామని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలను చర్చిస్తామన్నారు.

జనసేనకు ఇప్పుడు….

చెన్నై ఐఐటీ రాజధాని అమరావతిపై ఇచ్చిన నివేదికను ఎల్లో మీడియా వక్రీకరిస్తుందన్నారు. ఏవైనా అనుమానాలుంటే మద్రాస్ ఐఐటీకి మెయిల్ పెట్టి కనుక్కోవచ్చని తెలిపారు. మూడు రాజధానులకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నామన్నారు. కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదిస్తామని తెలిపారు. అమరావతిలో నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఉనికి కోసమే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయన్నారు. జనసేనకు ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లుందని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. అమరావతి రైతులపై తమకు సానుభూతి ఉందన్నారు. తాత్కాలిక భవనాలన్నింటినీ తాము ఉపయోగించుకుంటామని చెప్పారు. అమరావతిపై చంద్రబాబు అఖిలపక్షం నాడు నిర్వహించారా? అని నిలదీశారు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలూ బాగుండాలన్నదే తమ లక్ష్యమని బొత్స వివరించారు. పదమూడు జిల్లాల్లో అమరావతి ఒక భాగమవుతుందన్నారు.

Tags:    

Similar News