కర్నూలు క్వారీలో బ్లాస్ట్.. 11 మంది కార్మికులు మృతి

Update: 2018-08-04 02:05 GMT

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆలూరు మండలం హత్తిబెళగళ్ లోని మైనింగ్ క్వారీలో నిన్న రాత్రి బ్లాస్టింగ్ నిర్వహించారు. బండరాళ్లు మీద పడటంతో 11మంది కార్మికులు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతులందరూ ఒడిశా వాసులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్టు సమాచారం. బ్లాస్టింగ్ ధాటికి క్వారీలో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న రెండు షెడ్లు, ఒక లారీ, మూడు ట్రాక్టర్లు దగ్ధమయ్యాయి. షెడ్డులో మరికొంత మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, భారీ శబ్ధాలు రావడంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో పరుగులు తీశారు.పేలుడు కొన్ని కిలో మీటర్లు వరకు వినిపించాయి. పేలుడు దాటికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయం తో పరుగులు పెట్టారు.

ప్రమాదానికి గల కారణాలు......

అయితే పేలుడు ఏ ప్రాంతం నుంచి వస్తుందీ ప్రజలు కనుక్కోలేక పోయారు. ఒక్క గంట వరకుక్వారీ ప్రాంతంలోకి ఎవరు కూడా పోలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరూ తెలుసు కోలేక పోయారు. పోలీస్ మరియు ఫైర్ సిబ్బంది వచ్చిన తరువాత ప్రజలు యాక్సిడెంట్ స్పాట్లోకి వెళ్లారు. అప్పటికి అక్కడ శవాలు పడిపోయే ఉన్నాయ్. కొంత మంది రక్తం మడుగులో పడిపోయే ఉన్నారు. గాయపడిన వారందరిని హాస్పిటల్ కు తరలించారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ వద్ద క్వారీ పేలుడు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంలో ప్రాణ నష్టం పెరగకుండా చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

Similar News