బిన్నీ రాజీనామాకు కారణమేంటి..?

Update: 2018-11-14 08:20 GMT

ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్ కి సీఈఓ పదవికి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ రాజీనామా చేశారు. అమెజాన్ లో పనిచేసిన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ కలిసి 2007లో ఫ్లిప్ కార్ట్ ను ప్రారంభించారు. ఈ సంస్థను వాల్ మార్ట్ ఈ సంవత్సరం మేలో కొనుగోలు చేసింది. సచిన్ బన్సల్ పూర్తిగా వాటాను విక్రయించి సంస్థ నుంచి తప్పుకోగా బిన్నీ మాత్రం 77 శాతం వాటా విక్రయించి సంస్థ సీఈఓగా కొనసాగుతున్నారు. అయితే, ‘తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన’ ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనపై వాల్ మార్ట్ ఓ న్యాయవాద సంస్థతో విచారణ జరిపించింది.

ఆధారాలు లేవన్నా.....

బిన్నీతప్పు చేసినట్లుగా ఎటువంటి ఆదారాలు లేవని ఆ సంస్థ విచారణలో తేలింది. అయినా కూడా బిన్నీ రాజీనామా చేశారు. బిన్నీపై గతంలో ఫ్లిప్ కార్ట్ లో పనిచేసిన ఓ ఉద్యోగిని తనను శారీరకంగా వేదించాడని ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఆరోపణలు రుజువయ్యే ఆదారాలు లేకున్నా బిన్నీ రాజీనామా చేయడం గమనార్హం. బిన్నీ రాజీనామాను వాల్ మార్ట్ ఆమోదించింది. ఇక నుంచి సంస్థ వాటాదారుడిగా, బోర్డు సభ్యుడిగా కొనసాగుతానని బిన్నీ ప్రకటించారు.

Similar News