బ్రేకింగ్: ఏపీ ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ షాక్ ఇచ్చింది. కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపారనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా [more]

Update: 2019-04-04 07:59 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ షాక్ ఇచ్చింది. కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపారనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ ట్రైబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని వాటర్ మెన్ రాజేంద్ర సింగ్, పర్యావరణవేత్త అనుమోలు గాంధీ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటీషన్ దాఖలు చేశారు. కేంద్ర, రాష్ట్ర కాలుష్య మండళ్లు సైతం ఏపీలో రోజుకు 2,500 ట్రక్కుల చొప్పున 25 మీటర్ల లోతు ఇసుక తవ్వుతున్నారని నివేదికలు ఇచ్చాయి. దీంతో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని గుర్తించిన ట్రైబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Tags:    

Similar News