చంద్రబాబుకు మళ్లీ ఊరట..!

Update: 2018-09-26 06:15 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కోర్టులో మరో ఊరట దొరికింది. ఐటీ కంపెనీల పేరుతో రాష్ట్రంలో 25 వేల కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ ఇప్పుడు ఆ పిటీషన్ ను వెనక్కు తీసుకున్నారు. ఏపీఎన్ఆర్డీ ఛైర్మన్ వేమూరి రవికుమార్ తో కలిసి ఐటీ శాఖలో 25 వేల కోట్ల అవినీతి జరిగిందని పిటీషనర్ ఆరోపించారు. దొంగ ఎంఓయూలతో ఈ ముగ్గురూ డొల్ల కంపెనీలకు అనుమతులు ఇచ్చి వేల ఎకరాల భూమిని ధారాదత్తం చేశారని పేర్కొన్నారు. అర్హతలేని కంపెనీలతో ఒప్పందం చేసుకొని, నాలుగేళ్లుగా ఎలాంటి కార్యకలాపాలను చేపట్టలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఐటీ కంపెనీల పేరుతో జరిగిన క్విడ్ ప్రోకో పై సీబీఐ చేత విచారణ జరిపించాలని పిటీషనర్ కోరారు. అయితే, ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని, కంపెనీలకు సంబంధించి పూర్తి ఆధారాలతో రావాలని హైకోర్టు చెప్పడంతో పిటీషనర్ తన పిటీషన్ ను వెనక్కు తీసుకున్నారు.

Similar News