ఆ 40 లక్షల మంది భారతీయులు కాదా..?

Update: 2018-07-30 08:59 GMT

అస్సాంలో నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్ ఫైనల్ డ్రాఫ్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 3 కోట్ల 29 లక్షల మంది జనాభాలో 2 కోట్ల 89 లక్షల మందిని భారతీయులుగా గుర్తించింది ఎన్ఆర్సీ. మిగతా 40 లక్షల మందిని స్థానికేతరులుగా తేల్చింది. 1971 మార్చి 1కి ముందు నివాసమున్న వారిని మాత్రమే స్థానికులుగా గుర్తిస్తోంది. ఎన్ఆర్సీ ముసాయిదాతో అసోంలోని ఏడు జిల్లాల్లో 144 సెక్షన్ విధించి, భద్రతను పెంచారు. అయితే, గతేడాది కూడా ఈ జాబితాను ప్రకటించగా 15 లక్షల అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇంకా అభ్యంతరాలు తెలిపే అవకాశం కల్పించింది. అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు.

బీజేపీ కుట్ర ఉందన్న మమత...

అయితే ఈ ముసాయిదాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని బీజేపీ కుట్రగా ఆమె వర్ణించారు. ఆధార్, పాస్ పోర్టు ఉన్నా కొందరికి పౌరసత్వం ఇవ్వలేదని, బీజేపీ మైనారిటీలను విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎన్ఆర్సీలో పౌరసత్వం లేని వారు భారతీయులు కాదా అని ప్రశ్నించారు. ప్రతీ రాష్ట్రంలోనూ స్థానికేతరులు ఉంటున్నారన్నారు. బీజేపీది డివైడ్ ఆండ్ రూల్ పాలసీ అని, ఎన్నికల స్టంట్ మాత్రమే అని తీవ్రంగా విమర్శించారు.

Similar News