అశోక్ గెహ్లాత్ కు హైకోర్టులో చుక్కెదురు

రాజస్థాన్ హైకోర్టులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత పిటీషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలన్న సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే [more]

Update: 2020-07-24 05:55 GMT

రాజస్థాన్ హైకోర్టులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత పిటీషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలన్న సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే పిటీషన్ ను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో కేంద్రాన్ని కూడా హైకోర్టు ప్రతివాదిగా చేర్చింది. దీంతో విచారణ మరికొంత కాలం సాగే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం హైకోర్టుకు చేరేంత వరకూ అనర్హత పిటీషన్ పై తీర్పు వెలువడే అవకాశం లేదు. దీంతో సచిన్ పైలట్ వర్గానికి ఊరట లభించినట్లయింది. వీలయినంత త్వరగా అనర్హత వేటు వేసి శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాలనుకుంటున్న అశోక్ గెహ్లాత్ ఆశలకు హైకోర్టు గండికొట్టినటలయంది.

Tags:    

Similar News