నేషనల్ ప్లాన్ రూపొందించాల్సిందే

వ్యాక్సినేషన్ పై నేషనల్ ప్లాన్ రూపొందించకపోతే కష్టమేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి విధానంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే రెండేళ్లు పడుతుందన్నారు. ప్రస్తుతం [more]

Update: 2021-05-12 01:09 GMT

వ్యాక్సినేషన్ పై నేషనల్ ప్లాన్ రూపొందించకపోతే కష్టమేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటి విధానంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలంటే రెండేళ్లు పడుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో రెండు కంపెనీలే వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేస్తున్నాయని, ఇవి నెలకు ఆరు నుంచి ఏడుకోట్లు డోసులు మాత్రమే తయారుచేస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ లెక్కన దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే రెండేళ్ల సమయం పడుతుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వ్యాక్సిన్ తయారీని యుద్ధప్రాతిపదికన చేయాలన్నారు. ఇందుకోసం నేషనల్ ప్లాన్ ను రూపొందించాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.

Tags:    

Similar News