పవన్ …ఆత్మవిమర్శ చేసుకో

చంద్రబాబు చెప్పినట్లే పవన్ కల్యాణ్ నడుచుకుంటున్నాడని, వైసీపీ ప్రభుత్వాన్ని బద్ నామ్ చేయడానికే విశాఖలో పవన్ కల్యాణ‌్ లాంగ్ మార్చ్ పెట్టారని ఏపీ మంత్రులు కన్నబాబు, అనిల్ [more]

Update: 2019-11-02 08:18 GMT

చంద్రబాబు చెప్పినట్లే పవన్ కల్యాణ్ నడుచుకుంటున్నాడని, వైసీపీ ప్రభుత్వాన్ని బద్ నామ్ చేయడానికే విశాఖలో పవన్ కల్యాణ‌్ లాంగ్ మార్చ్ పెట్టారని ఏపీ మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ ఆరోపించారు. గత కొద్దిరోజులుగా కృష్ణా, గోదావరి నదులకు వరదలు రావడం కనిపించలేదా? అని ప్రశ్నించారు. వరదలు వచ్చిన సమయంలో ఇసుక ఎలా తీస్తారని వారు నిలదీశారు. వరదల సమయంలోనూ ఇసుకను తీసే టెక్నాలజీ ఏమైనా ఉంటే చెప్పాలని పవన్ కల్యాణ్ పై సెటైర్ వేశారు. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కన్పించని తప్పులు వైసీపీ ఐదు నెలల అధికారంలోనే కన్పిస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. అందుకే పవన్ కల్యాణ్ వెంట కమ్యునిస్టులు కూడా రావడం లేదన్నారు. చివరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాత్రమే మిగులుతారని, కామ్రేడ్లు ఎందుకు వెళ్లిపోయారో? ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రులు సూచించారు.

Tags:    

Similar News