మరోసారి ఈఎస్ఐ స్కాం లో..?

తెలంగాణ ఈ ఎస్ ఐ స్కాం లో మరొక సంచలనం చోటు చేసుకుంది..ఈ స్కాం పైన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది.. స్కాం లో [more]

Update: 2021-04-11 01:14 GMT

తెలంగాణ ఈ ఎస్ ఐ స్కాం లో మరొక సంచలనం చోటు చేసుకుంది..ఈ స్కాం పైన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది.. స్కాం లో ఇప్పటికే ఏసీబీ అధికారులు 35 మందిని అరెస్టు చేసి రిమాండ్ కుతరలించారు. ఇందులో వందల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా హవాలా ద్వారా నిధుల మళ్లింపు జరిగినట్టుగా బయటపడింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు.. ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడి దూకుడు పెంచింది. ఈఎస్ఐ స్కాం లో వందల కోట్ల రూపాయల స్కాం జరిగినట్లుగా ఏసీబీ గుర్తించింది. ఈ మేరకు దేవికా రాణితో పాటు 35 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేసింది. ఇందులో వందల కోట్ల రూపాయలను మాజీ డైరెక్టర్ దేవికారాణి కొల్లగొట్టినట్లు తేలింది. నిధుల మళ్లింపు ద్వారా దేవికారాణి వందల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టిన ట్లుగా ఏసీబీ విషయంలో బయటపడింది. దీంతో పాటు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను కూడా కొనుగోలు చేసినట్లు లోకి వచ్చింది. మరోవైపు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక తమిళనాడు పెద్ద మొత్తంలో దేవికారాణి ఆస్తులను కూడా పెట్టినట్టుగా కూడా ఏసీబీ విచారణలో బయట పడింది. సంబంధించి కేసు నమోదు చేసింది మనీలాండరింగ్ జరిగినట్టుగా గుర్తించింది.. హైదరాబాదులో మొత్తం పది చోట్ల ఈడి సోదాలు నిర్వహిస్తోంది. మాజీ కార్మిక నేత దివంగత నేత నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తుంది. నాయని కార్యదర్శిగా పనిచేసిన ముకుందరెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. పెద్దయెత్తున నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లుతెలుస్తోంది.

Tags:    

Similar News