బ్రేకింగ్ : జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్… మరో కేసు నమోదు

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై మరో కేసు నమోదయింది. తాడిపత్రి రూరల్ పరిధిలో నిన్న కడప నుంచి వస్తున్న వాహనాలను అడ్డుకున్న సీఐ దేవేంద్ర [more]

Update: 2020-08-07 12:33 GMT

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై మరో కేసు నమోదయింది. తాడిపత్రి రూరల్ పరిధిలో నిన్న కడప నుంచి వస్తున్న వాహనాలను అడ్డుకున్న సీఐ దేవేంద్ర కుమార్ ను జేసీ ప్రభాకర్ రెడ్డి దూషించారు. సీఐ దేవేంద్ర కుమార్ ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. రవాణా శాఖ లో రిజిస్ట్రేషన్ల లో అవకతవకలు జరిపారన్న కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డిని దాదాపు రెండు నెలల క్రితం అరెస్గ్ చేశారు. నిన్న బెయిల్ పై కడప జిల్లా నుంచి తాడిపత్రి వస్తుండగా సీఐకి, జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు జేసీ ప్రభాకర్ రెడ్డిపై నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డిలతో పాటు 31 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News