స్టేలు లేకపోతే చంద్రబాబు ఎప్పుడో?

అమరావతి అసైన్డ్ భూముల విషయంలో సీఐడీ విచారణపై చంద్రబాబు స్టే తెచ్చుకోవడాన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజాద్ భాషా అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా [more]

Update: 2021-03-20 01:19 GMT

అమరావతి అసైన్డ్ భూముల విషయంలో సీఐడీ విచారణపై చంద్రబాబు స్టే తెచ్చుకోవడాన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజాద్ భాషా అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా స్టేలతోనే గడుపుతున్నారని చెప్పారు. తనపై ఎలాంటి అవినీతి రుజువు చేయలేకపోయారని మరోవైపు సవాల్ చేస్తుంటారని అంజాద్ భాషా ఎద్దేవా చేశారు. స్టేలు తెచ్చుకుంటుంటే విచారణ ఎలా సాగుతుందని అంజాద్ భాషా ప్రశ్నించారు. తాను నిప్పు అని నిరూపించుకోవాలనుకుంటే చంద్రబాబు స్టేలు తెచ్చుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. అమారావతి లో జరుగుతున్న ఉద్యమమంతా కృత్రిమ ఉద్యమమేనని చెప్పారు.

Tags:    

Similar News