బ్రేకింగ్ : మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

నారా లోకేష్ ను అరెస్ట్ చేయడంతో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను అడ్డుకున్నారు. పామర్రు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వాహనాన్ని అడ్డుకోవడంతో [more]

Update: 2020-01-07 12:19 GMT

నారా లోకేష్ ను అరెస్ట్ చేయడంతో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను అడ్డుకున్నారు. పామర్రు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వాహనాన్ని అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలు ఎదురు తిరిగారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ స్పృహ తప్పి కింద పడిపోయారు. తాను అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వస్తుండగా టీడీపీ కార్యకర్తలు అనిల్ కుమార్ ను అడ్డుకోవడంతో తోట్లవల్లూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నారా లోకేష్ ను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. నారా లోకేష్ ను విడుదల చేయాలని కోరుతూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తోట్ల వల్లూరు గ్రామంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులను సర్దుబాటు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News