బ్రేకింగ్: ఏపీ సర్కార్ కు హై కోర్ట్ షాక్

Update: 2018-08-20 08:38 GMT

బసవ తారకం కిట్ల పథకంపై హై కోర్ట్ లో విచారణ నేడు విచారణ జరిగింది.. టెండర్లలో అవకతవకలు జరిగాయని హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. అర్హత లేని కంపెనీలకు అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని పిటీషన్ వేశారు. బసవతారకం కిట్ల పథకం అమలు పై స్టే మరో మూడురోజులు పొడగిస్తూ హైకోర్టు ఆదేశించింది. అగస్ట్ 15 న ఈపథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించాలనుకుంది. హైకోర్టు స్టే తో బసవతారకం కిట్ల పంపిణీ ఆగిపోయింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అర్హత లేకున్నా రెండు కంపెనీలకు కలిపి టెండర్ కట్టబెట్టారన్నది పిటీషనర్ ప్రధాన ఆరోపణ. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల అతుత్సహం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News