ఇవే ఏపీ రాష్ట్ర చిహ్నాలు..

Update: 2018-05-30 13:48 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేపింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చిహ్నాలు నిర్ణయించినా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిహ్నాలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండగా, దాని స్థానంలో ప్రస్తుతం రామచిలుకను గుర్తించారు.

Similar News