ఆమె కోసం ప్రత్యేకం!!

Update: 2018-04-24 10:00 GMT

అనసూయ అంటే హాట్ యాంకర్ మాత్రమే కాదు... రంగస్థలం సినిమా చూసాక రంగమ్మత్త పాత్రకి అనసూయ ఎంత బాగా సెట్ అయ్యిందో అనిపిస్తుంది. సుకుమార్ - రామ్ చరణ్ కోసమే రంగమ్మత్త పాత్రని ఒప్పుకున్న అనసూయకి అత్త పాత్ర అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే తనకి ఇంకా అత్త వయసు రాలేదని ఆమె ఫీలింగ్. కానీ రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్తగా అదరగొట్టేసింది.సచ్చినోడా... అల్లుడు అంటూ రామ్ చరణ్ తో అనసూయ చెప్పిన డైలాగ్స్ అదరగొట్టేశాయి. తనకిష్టం లేకపోయినా చేసిన రంగమ్మత్త పాత్రకి అనూహ్య స్పందన రాడంతో ఫుల్ హ్యాపీ అయ్యింది అనసూయ.

ప్రత్యేక పాత్రల్లోనే....

వెండితెర మీద హీరోయిన్ లాంటి పాత్రలు ఆశించిన అనసూయ కి హీరోయిన్ పాత్రలు రాకపోయినా ఆమెకు ప్రత్యేకమైన పాత్రలే వస్తున్నాయి. క్షణం సినిమాలో అనసూయ కి సినిమా ని మలుపు తిప్పే కీలక పాత్రే వచ్చింది. అలాగే ఐటెం సాంగ్ కి ఆడిపాడినా... అది ఆమె పేరు మీదే రాయడంతో ఆలోచించకుండా ఒప్పేసుకుంది. అయితే ప్రస్తుతం దర్శకులు అనసూయని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పాత్రలు డిజైన్ చేస్తున్నారట. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ హిట్స్ తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి వరుణ్ తేజ్ - వెంకటేష్ తో ఎఫ్ 2 అనే మల్టి స్టారర్ ని తెరకెక్కిస్తున్నాడు.

మల్టీ స్టారర్ చిత్రంలో....

ఈ సినిమాలో అనసూయ కోసం ఒక ప్రతేయకమైన పాత్ర సృష్టించాడట. ఈ పాత్ర ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. మరి అనసూయ పాత్రని అనిల్ రావిపూడి ఎలా డిజైన్ చేసాడో తెలియదు గాని... ఈ సినిమాలో అనసూయ పాత్ర ప్రత్యేకం కాబట్టి అనసూయ ఒప్పేసుకుందనే టాక్ వినబడుతుంది. ఇకపోతే వరుణ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వాల్సి ఉంది.

Similar News