దయచేసి నా సీటు మార్చండన్న ఆనం

ఆనం రామనారాయణరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచారు. పీపీఏల పై చర్చ జరుగుతున్న సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి సభా సంప్రదాయాలను వెలికి తెచ్చారు. చంద్రబాబునాయుడు సభలో [more]

Update: 2019-12-09 04:22 GMT

ఆనం రామనారాయణరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచారు. పీపీఏల పై చర్చ జరుగుతున్న సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి సభా సంప్రదాయాలను వెలికి తెచ్చారు. చంద్రబాబునాయుడు సభలో అరాచక శక్తులున్నాయని అనడంపై ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. “స్పీకర్ గారూ నా సీటును దయచేసి మార్చండి. నా సీటు వద్దకు చంద్రబాబు వచ్చి నిలబడటం నాకు సరిగా లేదు” అని ఆనం రామనారాయణరెడ్డి కోరారు. నిన్న నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యమేలుతుందని పార్టీపై ధ్వజమెత్తిన ఆనం రామనారాయణరెడ్డి సభలో మళ్లీ సెట్ అయినట్లే కన్పించింది. చంద్రబాబు వ్యాఖ్యలను ఆనం రామనారాయణరెడ్డి ఖండించారు.

Tags:    

Similar News