వైఎస్సార్ కాంగ్రెస్ లోకి సినీ నటుల క్యూ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి సినీ పరిశ్రమ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నటీనటులు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో [more]

Update: 2019-04-01 06:48 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి సినీ పరిశ్రమ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నటీనటులు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ నటులు జీవితా రాజశేఖర్, హేమ, యాంకర్ శ్యామల ఇవాళ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ… గతంలో తమకు కొత్త మనస్పర్థలు వచ్చినందున జగన్ కు దూరమయ్యామన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, అందుకే ఇప్పుడు పార్టీలో చేరామని తెలిపారు. కష్టపడే తత్వం కలిగిన జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఎవరిని కొడుతున్నారో పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పింది పచ్చి అబద్ధమని పేర్కొన్నారు.

Tags:    

Similar News