జగన్ పాలన బాగుంది.. ఆ విషయంలో మాత్రం?

జగన్ పాలన బాగుందని, కరోనా సమయంలోనూ జగన్ మంచిగా పాలన చేస్తున్నాడని సినీనటుడు మోహన్ బాబు అన్నారు. తెలంగాణాలో కేసీఆర్ పాలన కూడా బాగా ఉందని మోహన్ [more]

Update: 2020-08-22 15:23 GMT

జగన్ పాలన బాగుందని, కరోనా సమయంలోనూ జగన్ మంచిగా పాలన చేస్తున్నాడని సినీనటుడు మోహన్ బాబు అన్నారు. తెలంగాణాలో కేసీఆర్ పాలన కూడా బాగా ఉందని మోహన్ బాబు కితాబిచ్చారు. ప్రధాని మోదీ దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు బాగా పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు గురించి ఇప్పుడు మాట్లడబోనని చెప్పారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇప్పుడు కూడా సరిగా రావడం లేదన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో లాగా సమాధానం చెప్పకుండా జగన్ ప్రభుత్వం లేదన్నారు.తాము నిధులు విడుదల చేయాలని అడిగితే, త్వరలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతుందని, అందుకోసం వేచి చూస్తున్నానని మోహన్ బాబు అన్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మోహన్ బాబు ఈ వ్యాఖ్యాలు చేశారు.

Tags:    

Similar News