ఇరవై వేలకు కక్కుర్తి...కటకటాల్లోకి అధికారి

Update: 2018-07-21 11:14 GMT

సికింద్రాబాద్ జీహెచ్ఎంసి హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. 20వేల లంచం తీసుకుంటూ రెడ్ హండెడ్ గా పట్టుబడ్డాడు. తార్నాక కు చెందిన క్యాటరింగ్ సంస్థ యజమాని అబ్దుల్ అహ్మద్ వద్ద డబ్బులు తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. తార్నాకలో క్యాటరింగ్ బిజినెస్ చేసుకునే అబ్దుల్ అహ్మద్ కు జీహెచ్ఎంసీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ హెల్త్ ఆఫీసర్ ఫోన్ చేశారు. క్యాటరింగ్ కు ఎలాంటి అనుమతులు లేవని అనుమతులు తీసుకోవాలని చెప్పారు. మీపై రామకృష్ణ ఫిర్యాదు చేశాడని అతనితో మాట్లాడుకోమని హెల్త్ ఆఫీసర్ సలహా ఇచ్చారు.

విలేకరి మద్యవర్తిత్వంతో...

రామకృష్ణ తో మాట్లాడిన క్యాటరింగ్ యజమాని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రామకృష్ణ హెల్త్ ఆఫీసర్ ఇద్దరూ కలిసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్లాన్ ప్రకారం రామకృష్ణ మరియు హెల్త్ ఆఫీసర్ తో బేరసారాలు నిర్వహించారు. 60 వేలు డిమాండ్ చేసిన రామకృష్ణ... హెల్త్ ఆఫీసర్ తో మాట్లాడి ఫైనల్ గా ఇరవై వేలకు సెటిల్ చేశాడు. 20 వేలు లంచం తీసుకుంటూ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ ఏసీబీ అధికారులకు రెడ్ హండెడ్ గా పట్టుబడ్డాడు. రామకృష్ణను మరియు హెల్త్ ఆఫీసర్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. రామకృష్ణ తార్నాక ప్రాంతంలో ఒక దిన పత్రికలో విలేకరిగా పని చేస్తున్నాడు.

Similar News