అంత డబ్బు ఎక్కడది…ఎమ్మార్వో వెనక ఎవరు?

కీసర ఎమ్మార్వో లంచాల వెనకాల అధికారుల పాత్ర ఎంత వరకు ఉందన్న దానిపై ఏసీబీ విచారణ చేపట్టారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహం వల్లే నాగరాజు రెండు కోట్ల రూపాయలు [more]

Update: 2020-08-17 07:35 GMT

కీసర ఎమ్మార్వో లంచాల వెనకాల అధికారుల పాత్ర ఎంత వరకు ఉందన్న దానిపై ఏసీబీ విచారణ చేపట్టారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహం వల్లే నాగరాజు రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఉన్నతాధికారుల జోక్యం పైన ఏసిపి సమగ్ర దర్యాప్తు చేయబోతుంది. ఇందుకు సంబంధించి నలుగురు నిందితులను తిరిగి తమ కస్టడీకి ఇవ్వాలని ఏసిపి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా నాగరాజ్ దగ్గర దొరికిన కోటి 40 లక్షల రూపాయల నగదు పూర్తి వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు ఎసిబి ప్రయత్నాలు ప్రారంభించింది. అంజి రెడ్డి ఇంట్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నాగరాజు ఈ వ్యవహారాన్ని పూర్తిగా బయటకు తీసుకురావాలని ఎసిబి రంగం సిద్ధం చేసింది. ప్రధానంగా కోటి పది లక్షల రూపాయలు అంజిరెడ్డికి ఎక్కడినుంచి వచ్చాయి. ఎవరిచ్చారు. ఏలా తెచ్చారని దానిపైన దర్యాప్తు చేసేందుకు సిద్దమయింది.ఇంత పెద్ద మొత్తంలో నగదు అంజి రెడ్డి తన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు.. ఈ నగదు నిల్వలు టాక్స్ కట్టారా లేదా అనే దానిపైన దర్యాప్తు చేయబోతుంది. నలుగురు నిందితులను నాగరాజు,అంజి రెడ్డి, శ్రీనాథ్ , సాయి లను తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఇవాళ ఎమ్మార్వో నాగరాజు బ్యాంక్ లాకర్ ను ఏసీబీ అధికారులు తెరుస్తారు.

Tags:    

Similar News