ఈఎస్ఐ స్కాంలో సురేంద్రనాథ్ అరెస్ట్

ఈఎస్ఐ స్కామ్ లో మరొకరిని ఏసీబీ అరెస్టు చేసింది. తప్పడు మెడికల్ క్యాంపుల బిల్స్ ను పెట్టి కోట్ల రూపాయలను డ్రా చేసుకున్న సినియర్ అసిస్టెంట్ సురేంద్ర [more]

Update: 2019-09-30 11:26 GMT

ఈఎస్ఐ స్కామ్ లో మరొకరిని ఏసీబీ అరెస్టు చేసింది. తప్పడు మెడికల్ క్యాంపుల బిల్స్ ను పెట్టి కోట్ల రూపాయలను డ్రా చేసుకున్న సినియర్ అసిస్టెంట్ సురేంద్ర నాథ్ బాబును ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది. స్కామ్ వెలుగులోకి వచ్చిన తరువాత సురేంద్ర నాథ్ ఆడియోలు బయట పడ్డాయి. ఈ ఆడియో టేపుల ఆధారంగా ఏసీబీ విచారణ చేస్తోంది. ఈ ఆడియో టేపుల్లో కొంత మంది పార్మాస్టిస్టులను తప్పడు బిల్స్ పెట్టాలని బెదరించారు. బిల్స్ పెట్టని అధికారులను వేధింపులకు గురిచేసినట్లుగా ఆరోపణలున్నాయి.

ఈఎస్ఐలో ఎన్నెన్ని లీలలో…

వీటిపై విచారణ ప్రారంభించిన ఏసీబీ డైరెక్టర్ కార్యాలయంలో సినియర్ అస్టిస్టెంట్ గా పని చేస్తున్న సురేంద్ర నాథ్ బాబును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది. డైరెక్టర్ కార్యాలయంలో ఆరు సంవత్సరాలుగా అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఆర్సీ పురం డిస్పెన్సరీలో పనిచేయాల్సిన సురేంద్రను దేవికా రాణి అనధికారికంగా డైరెక్టర్ కార్యాలయానికి రప్పించింది. ఇక్కడ ఆమె కోసం పనిచేయించుకుంది. ఆర్సీ పురంలో సురేంద్ర నాథ్ ను అరెస్టు చేసిన ఏసీబీకి ఈ ఎస్ ఐ స్కామ్ లో కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నాయి. ఈ స్కామ్ లో దేవికా రాణి కీలక పాత్ర పొషించిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అరెస్టు చేసిన ఏడుగురు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కొర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.

 

 

Tags:    

Similar News