చంద్రబాబుకు ఊరట.. లక్ష్మీపార్వతి పిటీషన్ కొట్టివేత

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు నాయుడు అక్రమంగా ఆస్తులు సంపాదించారంటూ 2005లో ఏసీబీ [more]

Update: 2021-05-04 01:54 GMT

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు నాయుడు అక్రమంగా ఆస్తులు సంపాదించారంటూ 2005లో ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు . ఈ పిటిషన్ పైన సుదీర్ఘంగా వాదప్రతివాదనలు జరిగాయి. లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ పైన కోర్టు ఆదేశాలిచ్చింది. లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ కు అర్హత లేదని ,ఈ పిటిషన్ ను విచారణకు తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.. లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్ లో పేర్కొన్న ఆధారాలన్నీ నిరాధారంగా ఉన్నాయని దీనిని విచారణకు స్వీకరించిన అవసరం లేదని హైదరాబాద్ నాంపల్లి లోని అవినీతి నిరోధక శాఖ కోర్టు తేల్చిచెప్పింది..చంద్రబాబునాయుడు తన పదవిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించాడని లక్ష్మీపార్వతి ఆరోపణలు చేసింది. 2005లో ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ పైన సుదీర్ఘంగా వాదప్రతివాదనలు జరిగాయి. చివరికి ఈ రోజు ఈ పిటిషన్ కు అర్హత లేదంటూ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

Tags:    

Similar News