25 న ముద్రగడ పాదయాత్ర

Update: 2017-01-12 05:56 GMT

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ముద్రగడ నిర్ణయించుకున్నారు. ఈ నెల 25వ తేదీన పాదయాత్రకు సిద్ధమవుతున్నారు ముద్రగడ. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అమలాపురం మీదుగా అంతర్వేది వరకూ ముద్రగడ పాదయాత్ర చేస్తారు. ఈ పాదయాత్ర ఆరు రోజుల పాటు కొనసాగుతుందని ముద్రగడ తెలిపారు. పాదయాత్ర గాంధేయమార్గంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ముద్రగడ పాదయాత్ర కోసం పోలీసుల అనుమతిని కోరడం లేదు. తాను గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరి అనుమతి అవసరం లేదంటున్నారు. ముద్రగడ ఇటీవల ఏపీసీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాపు రిజర్వేషన్ హామీని అమలు చేయకపోవడం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు కూడా ముద్రగడకు లేఖ రాశారు. జగన్ ముసుగులో ఉద్యమం చేయొద్దని సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతిస్తుందా? లేక గతంలో లాగా ముద్రగడను హౌస్ అరెస్ట్ చేస్తుందా? అన్నది వేచి చూడాలి.

Similar News