బంగాళాఖాతంలో అల్పపీడనం..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపడీనం మరింత బలపడింది. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు..

Update: 2023-10-03 05:51 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపడీనం మరింత బలపడింది. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌, విశాఖ వాతావరణ శాఖలు తెలిపాయి. అయితే ఈ అల్పపీడం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపాయి. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ఉందన్నారు

అల్పపీడం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని సంగ్గారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, మేడ్చల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఇక మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అలాగే 4వ తేదీన కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక 5వ తేదీన మాత్రం చాలా వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రానున్న రెండు రోజుల పాటు తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.


Tags:    

Similar News