హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవేపై నిలిచిన వాహనాలు

హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవేపై వాహనాలు నిలిచిపోయాయి

Update: 2026-01-13 07:12 GMT

హైదరాబాద్‌-విజయవాడ నేషనల్‌ హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. కట్టెల లోడుతో వెళుతున్న లారీ పడిపోవడంతో రోడ్డు పై భారీగా వాహనాలు నిలిచపోయాయి. దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకూ వాహనాలు నిలిచపోయాయి. కట్టెలన్నీ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోవడంతో వాటిని తొలిగిస్తేనే కానీ వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో సొంత వాహనాలతో బయలుదేరిన వారు సకాలంలో సొంతూళ్లకు చేరుకుంటామా? లేదా? అన్న భయాందోళనలో ఉన్నారు.

టోల్ గేట్ల వద్ద కూడా...
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజా నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌స్తంభించింది. ఆంద్రప్రదేశ్ కి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జనం క్యూకట్టడంతో వాహనాలు హైదరాబాద్ నుంచే నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ ఏడాది రికార్డ్‌లో స్థాయిలో ప్రజలు సంక్రాంతి పండగకు తరలి వెళ్లారని టోల్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.


Tags:    

Similar News