Telangana : ఈ ముగ్గురికి రేవంత్ ఫోన్ కాల్స్

తెలంగాణ మంత్రివర్గంలో ముగ్గురికి స్థానం లభించింది.

Update: 2025-06-08 04:10 GMT

తెలంగాణ మంత్రివర్గంలో ముగ్గురికి స్థానం లభించింది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి, బీసీ సామాజికవర్గానికి చెందిన ఒకరికి స్థానం దక్కింది. మొత్తం మూడు పేర్లను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఖరారు చేసింది. ఎస్సీ మాల సామాజికవర్గం కింద చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ కు తెలంగాణ మంత్రివర్గంలో స్థానం లభించింది.

ముగ్గురికి చోటు...
అలాగే మాదిగ సామాజికవర్గానికి చెందిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు కూడా ఈ సారి అవకాశం ఇచ్చారు. ఇక మూడో మంత్రిగా బీసీ సామాజికవర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ ముగ్గురు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకరాం చేయనున్నారు.


Tags:    

Similar News