టీఆర్ఎస్ ఎటు వైపు?

రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతుంది. బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు.

Update: 2022-06-21 07:55 GMT

రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతుంది. బీజేపీ బలపర్చిన అభ్యర్థిని మద్దతు ఇచ్చే అవకాశం లేదు. అలాగే కాంగ్రెస్ కూటమిలోని అభ్యర్ధిని ఏ మేరకు అభ్యర్థిస్తుందనేది చూడాలి. ఇటీవల మమత బెనర్జీ జరిపిన సమావేశానికి కూడా టీఆర్ఎస్ హాజరు కాలేదు. సమావేశానికి దూరంగా ఉంది.

బహిష్కరిస్తుందా?
విపక్షాల నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరు దాదాపు ఖరారయింది. ఆయన టీఎంసీకి రాజీనామా చేశారు. ఆయన అభ్యర్థిత్వం పట్ల కూడా టీఆర్ఎస్ అంత సుముఖంగా లేదని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలను టీఆర్ఎస్ బహిష్కరిస్తుందన్న వాదన కూడా లేకపోలేదు. బీజేపీ కనుక వెంకయ్య నాయుడును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీ పునరాలోచించుకునే అవకాశముంది. తెలుగు వ్యక్తికి అవకాశం దక్కుతున్నప్పుడు సహకరించామని ప్రజలకు చెప్పుకునే వీలుంటుంది. మొత్తం మీద టీఆర్ఎస్ రాష్ట్రపతి అభ్యర్థుల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే ఒక నిర్ణయం వెలువడే అవకాశముంది.


Tags:    

Similar News