హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. 30 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2021-12-25 02:53 GMT

తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. 30 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా సీవీ ఆనంద్ ను నియమించారు. ప్రస్తుతం కమిషనర్ గా ఉన్న అంజనీకుమార్ ను ఏసీబీ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏసీబీ డైరెక్టర్ గా శిఖా గోయల్, నల్లగొండ ఎస్పీగా రమా రాజేశ్వరి,, వెన్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాధ్, క్రైమ్ డీసీపీగా కల్మేశ్వర్, మెదక్ ఎస్పీగా రోహిణి, సైబరాబాద్ జాయింట్ సీపీగతా అవినాహ్ మహంతి నియమితులయ్యారు.

ముప్ఫయి మంది ఐపీఎస్ లను...
వీరితో పాటు నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి, సీసీఎస్ డీసీపీగా గజరాంగ్ భూపాల్ ను నియమించారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్ ఎస్పీగా శరత్ చంద్ర, వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి, నిజామాబాద్ సీపీ గా కేఆర్ నాగరాజు నియమితులయ్యారు. మొత్తం 30 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ఒకే సారి బదిలీ చేయడం విశేషం.


Tags:    

Similar News