నేడు భద్రాద్రి జిల్లాకు మీనాక్షి నటరాజన్

తెలంగాణ రాష్ట్ర వ్యవహారా ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్నారు.

Update: 2025-05-31 03:25 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యవహారా ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు భద్రాద్రి జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో ఆమె సమావేశం కానున్నారు. గత కొద్ది రోజులుగా పార్టమెంటు నియోజకవర్గాల నేతలతో మాట్లాడుతున్న మీనాక్షి నటరాజన్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు.

పార్టీ అంతర్గత విషయాలపై...
అదే సమయంలో పార్టీ అంతర్గత విషయాలపై కూడా మీనాక్షి నటరాజన్ దృష్టి పెట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడాన్ని గుర్తించిన మీనాక్షి నటరాజన్ వారి మధ్య గ్యాప్ రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. నేడు పార్లమెంటు నియోజవకర్గాల నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం అవుతున్నారు.


Tags:    

Similar News