Telagnana : తెలంగాణ ఆర్టీసీ వీరబాదుడు

సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం మోపింది

Update: 2026-01-08 04:32 GMT

సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం మోపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణలో 6431 ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 9,10,12,13,18,19 రోజుల్లో 6431 ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది.

యాభై శాతం అదనపు ఛార్జీలు...
ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ముందుగా రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా తెలంగాణ ఆర్టీసీ కల్పించింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారు సురక్షితంగా తమ గమ్యస్థానం చేరుకోవాలంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రజలను కోరుతున్నారు.


Tags:    

Similar News