Telangana : రేవంత్ తో మీనాక్షి నటరాజన్ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో ముగ్గురి మధ్య చర్చ జరుగుతుంది. ప్రధానంగా వివిధ జిల్లా నేతలతో సమావేశమైన మీనాక్షి నటరాజన్ వారి అభిప్రాయాలను కూడా సీఎంకు వివరించినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై...
అదే సమయంలో త్వరలో ఎన్నిక జరుగుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థులపై వీరి మధ్య చర్చ జరిగే అవకాశముంది. ఎవరు పార్టీకి పనిచేశారు? ఎవరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే బాగుంటుందన్న దానిపై మీనాక్షి నటరాజన్ తన అభిప్రాయాలను రేవంత్ రెడ్డితో చర్చించినట్లు చెబుతున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉన్నందున ప్రయారిటీ పద్ధతిలో పార్టీ కోసం పనిచేసిన వారందరికీ పదవులు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించడంపై కూడా చర్చజరిగినట్లు తెలిసింది.