Breaking : సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది

Update: 2026-01-12 08:09 GMT

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తరుపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు జరిపారు. తెలంగాణ వేసిన పిటీషన్ కు అర్హత లేదని సుప్రీంకోర్టు తెలిపింది.

విచారణ సందర్భంగా...
గత విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈకేసులో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటీషన్ ను వెనక్కుతీసుకుంది. సుప్రీంకోర్టులో కేసును తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఇప్పుడు పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీకి ఇబ్బంది కరంగా లేనట్లయింది.


Tags:    

Similar News